Mosambi /బత్తాయి!

మన రాష్ట్రంలో ఈ తోటలు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 21.22 లక్షల టన్నుల పంట దిగుబడి నిస్తున్నవి. దిగుబడి షుమారుగా ఎకరాకు 10 టన్నులు. చీని, నిమ్మ పండ్ల నుండి పెక్టిన్, సిట్రిక్ ఆమ్లం, నిమ్మనూనె, నిమ్మ ఎస్సెన్స్ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. పూలు, ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలు తయారు చేయవచ్చు.

750 మి.మీ. వర్ష పాతం మరియు నీటి ఆధారం కల్గి,గట్టి ఈదురు గాలులు లేని ప్రాంతాలు అనుకూలం. సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తు వరకు సాగుచేయవచ్చు.

నేలలు: 
నీరు నిలువని లోతైన ఎర్ర గరప నేలలు శ్రేష్టం. తేలికపాటి నల్లభూములు కూడా అనుకూలం. ఏ కాలంలో నైనా నేలలోని నీటి మట్టం కనీసం 2 మీటర్ల క్రింద ఉండాలి.
నేలలోని ఉదజిని సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. బంక నేలలు, పల్లపు భూములు, చవుడు భూములు పనికిరావు.
నీరు త్వరగా ఇంకిపోని, తక్కువ లోతుగల, రాతి పొరల నేలలు పనికిరావు, అధిక పాలు సున్నపురాళ్ళు ఉంటె, చెట్లు పల్లాకు తెగులుకు గురై త్వరగా క్షీణిస్తాయి.

విత్తనాలు: 
మొక్కల ఎంపిక : 
చీనీలో రంగపూర్ నిమ్మపై కట్టిన వైరస్ తెగుళ్ళులేని అంట్లను, నిమ్మలో మొలకలు లేదా గజ నిమ్మలో రంగపూర్ నిమ్మకట్టిన అంట్లను ఎన్నుకోవాలి.

అంట్ల ఎంపికలో మెళకువలు : 
వేరు మూలంపై 15 సెం.మీ. ఎత్తులో కట్టిన అంట్లను ఎన్నుకోవాలి. అంటు కట్టిన తరువాత 6-10 నెలల వయస్సుగల అంట్లను ఎన్నుకోవాలి. మొజాయిక్, గ్రీనింగ్, ట్రిస్టిజా మొదలైన వెర్రితెకుళ్ళు లేని అంట్లను ఎన్నుకోవాలి. కణుపుల మధ్య దూరం దగ్గరగా ఉండి, ఆకుల పరిమాణం మధ్యస్థంగా ఉన్న అంట్లు నాణ్యమైనవి. ముదురు ఆకు దశలో ఉన్న అంట్లను ఎన్నుకోవాలి.

అంట్లు నాటే సమయంలో జాగ్రత్తలు : 
అంట్లు నాటేటప్పుడు అంటు భాగం నేల మట్టం నుంచి 15 సెం.మీ. ఎత్తులో ఉండాలి. సాయంత్రం వేళళ్ళో అంట్లు నాటాలి. నాటిన అంట్ల ప్రక్కన కర్ర నాటి ఊతం ఇవ్వాలి.

నాటటం : 
చీనీ, నిమ్మ మొక్కలను 6 x 6 మీటర్ల దూరంలో నాటాలి. సారవంతమైన నేలల్లో 8 x 8 మీ. దూరంలోనూ నాటుకోవచ్చు. మొక్కలను నాటడానికి ఒక నెల రోజుల ముందే 1 x 1 x 1 మీటరు పరిమాణం గల4 గుంతలను త్రవ్వి ఆర బెట్టాలి. ప్రతి గుంతలోనూ పై పొర మట్టితో పాటు 40 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సూపర్ ఫాస్ఫేటు, 100 గ్రాముల పది శాతం లిండేను పొడివేసి కలిపి నింపాలి.

విత్తనాలు: 
మొక్కల ఎంపిక :చీనీలో రంగపూర్ నిమ్మపై కట్టిన వైరస్ తెగుళ్ళులేని అంట్లను, నిమ్మలో మొలకలు లేదా గజ నిమ్మలో రంగపూర్ నిమ్మకట్టిన అంట్లను ఎన్నుకోవాలి.

అంట్ల ఎంపికలో మెళకువలు : 
వేరు మూలంపై 15 సెం.మీ. ఎత్తులో కట్టిన అంట్లను ఎన్నుకోవాలి. అంటు కట్టిన తరువాత 6-10 నెలల వయస్సుగల అంట్లను ఎన్నుకోవాలి. మొజాయిక్, గ్రీనింగ్, ట్రిస్టిజా మొదలైన వెర్రితెకుళ్ళు లేని అంట్లను ఎన్నుకోవాలి. కణుపుల మధ్య దూరం దగ్గరగా ఉండి, ఆకుల పరిమాణం మధ్యస్థంగా ఉన్న అంట్లు నాణ్యమైనవి. ముదురు ఆకు దశలో ఉన్న అంట్లను ఎన్నుకోవాలి.

అంట్లు నాటే సమయంలో జాగ్రత్తలు : 
అంట్లు నాటేటప్పుడు అంటు భాగం నేల మట్టం నుంచి 15 సెం.మీ. ఎత్తులో ఉండాలి. సాయంత్రం వేళళ్ళో అంట్లు నాటాలి. నాటిన అంట్ల ప్రక్కన కర్ర నాటి ఊతం ఇవ్వాలి.

నాటటం : 
చీనీ, నిమ్మ మొక్కలను 6 x 6 మీటర్ల దూరంలో నాటాలి. సారవంతమైన నేలల్లో 8 x 8 మీ. దూరంలోనూ నాటుకోవచ్చు. మొక్కలను నాటడానికి ఒక నెల రోజుల ముందే 1 x 1 x 1 మీటరు పరిమాణం గల4 గుంతలను త్రవ్వి ఆర బెట్టాలి. ప్రతి గుంతలోనూ పై పొర మట్టితో పాటు 40 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సూపర్ ఫాస్ఫేటు, 100 గ్రాముల పది శాతం లిండేను పొడివేసి కలిపి నింపాలి.

రకాలు: 
సాత్ గుడి , బటావియన్(బత్తాయి) , మొసంబి

ఎరువులు (గ్రాముల్లో ఒక్కొక్క పాదికి): 
మొక్క వయస్సు సాత్ గుడి, బత్తాయి
నత్రజని భాస్వరం పొటాష్
1వ సంవత్సరం 300 70 80
2వ సంవత్సరం 600 140 160
3వ సంవత్సరం 900 210 240
4వ సంవత్సరం 1200 280 320
5వ సంవత్సరం మరియు ఆ పైన‌ 1500 350 400

పాతిన మొక్క పెరిగే కొద్ది 4 నుండి 10 అడుగుల వ్యాసంతో చుట్టూ పాదుని తయారు చేసుకోవాలి. ఎరువులను కూడా మొక్క వయసును బట్టి మొదలుకు 2 నుండి 4 అడుగుల దూరంలో వేసి మట్టితో కప్పాలి. 

నీటి యాజమాన్యం: 
చిన్న మొక్కలకు ఎండ కాలంలో తరుచుగా నీరు కట్టాలి. చెట్టుకు ఎంత నీరు కట్టాలి అనేది నేల, వాతావరణం, చెట్ల వయస్సు, దిగుబడుల పైన ఆధారపడి ఉంటుంది. 

చెట్టు పూత, పిందెలపై ఉన్నపుడు క్రమం తప్పక నీరు కట్టాలి. నీటి ఎద్దడి ప్రాంతాల్లోని చెట్ల పాదుల్లో ఎండాకులు, వరి పొట్టు, లేదా వేరుశనగ పొట్టు 8 సెం.మీ. మందంలో వేసి తేమ ఆవిరై పోకుండా కాపాడు కోవచ్చు.

ఎరువులు వేసిన వెంటనే సమృద్ధిగా నీరు పెట్టాలి. డబుల్ రింగు పద్ధతిలో నీరు కట్టడం మంచిది.
పిల్లపాదిని 2 – 4 అడుగుల వ్యాసంలో మొక్క మొదలు దగ్గరగా చేసి చెట్టు మొదలకు తాకకుండా చూడాలి.
షుమారుగా 6 నుంచి 8 ఉదజని సూచిక ఉన్న నేలల్లో 0.75 డెసీసైమన్ / మీ. కన్నా తక్కువ విధ్యుత్ ప్రవాహం గల సాగు నీటిని వాడి తోటలను లాభదాయకంగా పెంచవచ్చు. డ్రిప్పు పద్ధతిలో నీరు కట్టడం వలన నీటి ఆదాయే గాక మొక్కల పెరుగుదల. కాయ నాణ్యత కూడా పెరుగు తాయి. డ్రిప్ పద్ధతిలో నీరు కట్టేటప్పుడు అన్ని చెట్లకు సమృద్ధిగా నీరు అందుతుంది.

కలుపు నివారణ, అంతరకృషి / అంతరపంటలు: 
కాపురాక ముందు రెండు, మూడు సంవత్సరాల వరకు అంతర పంటలుగా వేరుశనగ, అపరాలు, బంతి, దోస, ఉల్లి, పుచ్చ వేయవచ్చు.

మిరప, టొమోటో, వంగ, పొగాకు పైర్లను వేయకూడదు.ఈ పైర్లను వేయటం వలన నులి పురుగుల బెడద ఎక్కువవుతుంది. వర్షాకాలంలో జనుము, అలసంద, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత సమయంలో పాదిలో మరియు భూమిలో వేసి కలియ దున్నాలి.

పాదులు గట్టిపడకుండా అప్పుడప్పుడు త్రవ్వాలి. పాదులు త్రవ్వేటపుడు, ఎరువులు వేసేటపుడు వేర్లు ఎక్కువ తెగకుండా తేలికపాటి సేద్యం చేయాలి. మామిడిలో తెలిపిన కలుపు నివారణ చర్యల ద్వారా చీనీ, నిమ్మలలో కలుపును నివారించవచ్చు.

పూత,పిందె రాలుడును అరికట్టటం: 
పిందె, కాయ రాలుట రెండు దశలుగా గమనించవచ్చు. చెట్ల పాదుల్లోని ఒడుదుడుకులు, హఠాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పులు, కొన్ని చెట్లలో జరిగే రసాయనిక మార్పుల వలన పెందె, కాయ రాలటం జరుగుతుంది.

చెట్లు పూత, పిందెలతో ఉన్నపుడు త్రవ్వడం, దున్నడం చేయరాదు. ఎండలు ముదిరే కొద్దీ చెట్లకు క్రమం తప్పక నీరు కట్టాలి లేదా 10 పి.పి.యం. 2, 4 డి మందు (అంటే 1 గ్రాము 100 లీటర్ల నీటిలో ) కలిపి పూత సమయంలో ఒక మారు, పిందె గోళి గుండు సైజులో ఉన్నపుడు ఇంకోక మారు పిచికారి చేయాలి.

సస్యరక్షణ‌ – పురుగులు : 
ఆకుముడత : 
దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ లీటరు నీటికి కలిపి లేత చిగుర్ల దశలోనే 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

గొంగళి పురుగులు : 
వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా హాల్ట్ (బిటి) 1 గ్రా లీటరు నీటికి కలిపి పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడే పిచికారి చేయాలి.

తెల్లపొలుసు పురుగులు : 
వీటి నివారణకు కాండాన్ని, కొమ్మలను గోనె పట్టాతొ రుద్ది మిధైల్ డెమెటాన్ / డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి కాండం, కొమ్మలపై పిచికారి చేయాలి.

నల్లి పురుగులు : 
వీటి నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేక డైకోఫాల్ ను 2.7 మి.లీ. కలిపి సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో నెలకొక సారి పిచికారి చేయాలి.

నల్ల దోమ : 
ప్రోఫినోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ లేదా ఎసిఫేట్ 1.0 గ్రా. లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం, పై భాగం బాగా తడిచే టట్లు చిగురు వచ్చే దశలో (జూలై, ఆగష్టు, అక్టోబర్, డిశంబర్ నెలలో) పిచికారి చేయాలి.

పేనుబంక మరియు ఎగిరే పేను: 
వీటి నివారణకు డైమిధోయేట్ 2 మి.లీ. లేదా మిధైల్ డెమటాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు: 
కాయలుగా ఉన్నప్పుడే తాటాకు బుట్టను కట్టటం వలన పురుగు నుంచి రక్షణ కలుగుతుంది. తోట చుట్టూ ఉన్న పొదలను, తిప్ప తీగలను తీసి వేసి పురుగు బెడద తగ్గించవచ్చు.

నులి పురుగులు : 
చెట్టుకు 50 గ్రాముల కార్బోప్యురాన్ గుళికలు చెట్టు పాదులోని మట్టితో కలిపి నీరు పారించాలి. నులి పురుగుల తాకిడికి లోనయ్యే వంగ, టొమాటో, పొగాకు పంటలను చీనీ, నిమ్మ తోటల్లో అంతర పంటలుగా వేయరాదు. 

బంక తెగులు : 
బంక కారి కుళ్ళిన బెరడును పూర్తిగా గోకి బోర్డో పేస్టు లేదా కాపర్ ఆక్సీక్లోరైడు పేస్టు పూయాలి. క్రమం తప్పక, ముందు జాగ్రత్తగా, బోర్డోపేస్టు మొదళ్ళకు పట్టించాలి. కొమ్మల‌పై వచ్చే బంక తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండజిమ్ 1గ్రా. కలిపి మందు ద్రావణం చెట్టు పాదులో పోయాలి. 

వేరుకుళ్ళు తెగులు : 
వ్యాధి సోకిన తొలి దశలోనే గమనించి చెట్టుకు నీరు కట్టి మరుసటి రోజు కార్బండజిమ్ 2 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి లేదా చెషంట్ మందును (3 గ్రా. లీటరు నీటికి) లేదా 1 శాతం బోర్డో మిశ్రమాన్ని చెట్ల పాదుల్లో నేల తడిచేటట్లు పోయాలి. 

గానోడెర్మా (పుట్టగొడుగులు) తెగులు : 
తెగులు సోకిన చెట్టు మొదలును గోకి బోర్డోపేస్టు పూయాలి. లీటరు నీటికి 2.5 మి.లీ. కాలిక్సిన్ కలిపి చదరపు మీటరుకు లీటరు మందు నీరు చొప్పున పీచు వేర్లు తడిచేటట్లు పాదుల్లో పోయాలి.

బూడిద తెగులు : 
నివార‌ణకు 1 మి.లీ. డైనోకాప్ లేక 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

ఫెల్టు (రబ్బరు) తెగులు: 
నివారణకు పొలుసు పురుగులు ఆశించకుండా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ.తో పాటు మాం‍కోజెబ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వ్యాధి సోకిన కొమ్మలను కత్తి‍రించి కాల్చివేయాలి.

పింకు తెగులు : 
నివారణకు వర్షాకాలం అయిన వెంటనే తెగులు సోకిన కొమ్మలు ఎండినట్టు కలిపిస్తే వాటిని 2-3 అంగుళాలు క్రింద వరకు కత్తిరించి బోర్డోపేస్ట్ పూయాలి. కత్తింరించిన కొమ్మలు కాల్చివేయడం మంచిది.

చీనీ కాయ తొడిమకుళ్ళు తెగులు : 
నివారణకు చెట్టులోనే కుళ్ళి ఎండిన కాయల్ని తొడిమతో కత్తిరించి పోగుచేసి నాశనం చేయాలి. కార్బండజిమ్ 1 గ్రాము, లీటరు నీటికి కలిపి జూన్, జులై, ఆగష్టు నెలల్లో పిచికారి చేయాలి.

చెట్టు బెరడుపై నిలువు పగుళ్ళు : 
నివారణకు కొమ్మల పైన చారలు గమనించిన వెంటనే కార్బండజిమ్ 1 గ్రాము లీటరు నీటికి చొప్పున కలిపి 2 సార్లు పిచికారి చేయాలి. చెట్ల పాదిలో నీరు కట్టిన మరుసటి రోజు ఒక చదరపు మీటరుకు లీటరు వంతున 1 శాతం బోర్డో మిశ్రమాన్ని పోయాలి. మొజాయిక్ తెగులు : ఆకులపై పసుపు ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి “మొజాయిక్” లాగా కన్పిస్తుంది. దీని నివారణకు వ్యాధి సోకిన చెట్ల నుంచి అంటు మొగ్గలు చేయరాదు. వాటి నుంచి తయారైన అంట్లను నాటరాదు. 

బడ్ యూనియన్ క్రీజ్ తెగులు : 
తెగులు సోకిన చెట్లలో అంటు కట్టిన చోట కాండం ఉబ్బినట్లు కనిపిస్తుంది. జాయింట్ వద్ద బెరడును కత్తితో తీస్తే లోపలివైపున బడ్ జాయింట్ వద్ద కొయ్యపైన తేనె రంగులో గీత ఉంటుంది. దీని నివారణకు రంగపూర్ నిమ్మపైన అంటుకట్టిన మొక్కలు వాడాలి. 

యల్లో కార్కి వీన్ తెగులు : 
చీనీ మరియు నిమ్మలో వస్తుంది. ఆకుల్లోని ఈనెలు పసుపుపచ్చగా మారి మందంగా బెండు లాగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు లేని చెట్లనుంచి తీసిన కొమ్మంట్లను వాడి తయారుచేసిన మొక్కలు నాటుకోవాలి. 
ReplyForward