top of page
Writer's pictureJindam Agro Farms

Mirchi / మిరప!

మిరప

రాష్టంలో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది.మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి,ఆహారానికి రంగు రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు,ఔషధ లక్షణాలున్నాయి.రాష్ట్రంలో అన్ని ప్రాంతంలో మిరపను సాగు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో మిరప 3.53 లక్షల ఎకరాలలో సాగుచేయబడుతూ,5.14లక్షల టన్నుల దిగుబడినిస్తుంది.

నేలలు

వర్షాధారపు పంటకు నల్ల నేలలు,నీటి ఆధారపు పైరుకు నల్ల నేలలు,చల్కా నేలలు,లంక భూములు ,ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం.మిరపకు మెత్తటి దుక్కి కావలి.3-4సార్లు దుక్కి దున్ని 2సార్లు గుంటక తోలాలి.

విత్తటం

ఖరీఫ్-జూలై,ఆగుష్టు,రబీ-అక్టోబర్,నవంబరు

విత్తన మోతాదు

నారు పె౦చె౦దుకు సె౦టుకు 650గ్రాములు (ఒక ఎకరానికి సరిపడునారు వస్తుంది.)విత్తనం ఎద పెట్టుటకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం కావాలి.

విత్తన శుద్ధి

కిలో మిరప విత్తనానికి మొదటగా వైరస్ తెగులు నివారణకు గాను 150గ్రా.ట్రైసోడియం ఆర్ధోఫాస్ఫేట్ ను,తర్వాత రసం పీల్చే పురుగుల నివారణకు గాను 8 గ్రా.ఇమిడాక్లోప్రిడ్,మూడవ సారి ఇతర తెగుళ్ళ నివారణకు గాను 3గ్రా.కాప్టాన్ లేదా 3గ్రా.మాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

నాటటం

6 వారాల వయస్సు గల మొక్కలు నాటటానికి అనుకూలం.భూమిలో గల సారాన్ననుసరించి,ఈ క్రింద ఉదహరించిన దూరంలో నాటుకోవాలి. వర్షాదారపు పైరుకు 56 15సెం.మీ దూరంలో పాదుకు ఒక మొక్క చొప్పున ,నీటి వసతి క్రింద 56 56 లేదా 60 60 లేదా 90 60 సెం.మీ ఎడం చొప్పున పాదుకు 2 మొక్కల చొప్పున నాటుకోవాలి.గట్లపై కూడా నాతుకోవచ్చు.

ఎరువులు

ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వాడాలి లేదా పచ్చి రొట్ట పైరును పెంచి భూమిలో కలియదున్నాలి.వర్షాధారపు పైరుకు నత్రజని 24+ భాస్వరం 16+ పోటాష్ 20కి/ఎకరాకు.ఆఖరి దుక్కిలో నత్రజని 12+భాస్వరం 16+పోటాష్ 10కి/ఎకరాకు,పై పాటుగా నత్రజని 12+పోటాష్ 10 కి/ఎకరాకు నీటి వసతి క్రింద నత్రజని 120+భాస్వరం24 +పోటాష్ 48 కి/ఎకరాకు,ఆఖరి దుక్కిలో నత్రజని 30 +భాస్వరం 24+పోటాష్ 12కి/ఎకరాకు,పై పాటుగా మూడు దఫాలుగా నత్రజని 30+ పోటాష్ 12కి/ఎకరాకు చొప్పున,నాటిన నెల తర్వాత నుంచి 3 వారాల వ్యవధిలో వేయాలి.

నీటి యాజమాన్యం

మిరపలో నీరు ఎక్కువైతే పూత రాలి దిగుబడి తగ్గుతుంది.తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశిస్తాయి.పైరుకు పెట్టే తడుల సంఖ్య,తడుల వ్యవధి నేలను బట్టి,మిరప పెంచే కాలాన్ని బట్టి,వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది.తేలిక నెలల్లో 10 నుంచి 15 రోజులకు ఒకసారి,నల్ల రేగడి నెలల్లో 3 వారాలకు ఒకసారి ,ఎండా కాలంలో 5-6 రోజులకు ఒకసారి తదిపెట్టాలి. నల్ల రేగడి నెలకు నీరు ఎక్కువగా పెట్టరాదు.మిరపకు పూత ,పిందె దశల్లో తప్పకుండా నీరుపెట్టాలి.

కలుపు నివారణ,అంతర కృషి

నాటుటకు 1,2 రోజుల ముందు ఫ్లూక్లోరాలిన్ 45 ఎకరాకు ఒక లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి లేదా పెండిమిథాలిన్ 30 ఎకరాకు 1.3 నుండి 1.6 లీ లేదా ఆక్సిఫ్లోరో ఫిన్ 23.5 200 మీ.లీ చొప్పున ఎదో ఒకదానిని 200 లి.నీటిలో కలిపి పిచికారి చేయాలి.నాటిన 25,30 రోజుల తర్వాత 15,20 రోజుల వవధిలో అవసరాన్ని బట్టి గొర్రు,గుంతకలతో అంతర కృషి చేయాలి.

పైముడుత

రెక్కల పురుగులు ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చటం వాళ్ళ ఆకుల అంచులు పైకి ముడుచు కుంటాయి.ఆకులు,పిందెలు రాగి రంగులోకి మారి పూత ,పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు కార్బరిల్ 3 గ్రా లేదా ఫాసలోన్ 3 మి,లీ లేదా స్పైనోసార్ 0.25మి.లీ లీటరు నీటికి కలిపి ఆకు అడుగు భాగం బాగా తడిచేల పిచికారి చేయాలి.నాటిన 15 మరియు 45 వ రోజు ఫిప్రొనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8కిలోలు చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయటం ద్వారా పై ముదతను నివారించుకోవచ్చు.ముందు జాగ్రత్త చర్య గా ఇమిడా క్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి.రసాయన,సే౦ద్రియపు ఎరువుల సమతుల్యత పాటించాలి.పై ముడుతతో పాటు క్రింద ముడుత (తెల్ల నల్లి)కూడా ఉంటే కార్బరిల్ మరియు ఎసిఫేట్ మందులు వాడ కూడదు.

పెను బంక

పెనుబంక లేత కొమ్మల ,ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చటం వలన పెరుగుదల తగ్గుతుంది.తియ్యటి పదార్ధాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుంది.ఆకులు ,కాయలు నల్లటి నల్లటి మసిపూసి నట్లుగా మారిపోతాయి. దీని నివారణకు మిథైల్ డేమెటాన్ 2మి.లీ లేదా ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

1 view0 comments

Recent Posts

See All

Commentaires


bottom of page